-
Notifications
You must be signed in to change notification settings - Fork 0
/
Copy pathcorpus_movie_review.txt
22 lines (22 loc) · 72.5 KB
/
corpus_movie_review.txt
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
0 గర్భవతి అయిన ఓ మహిళ.. తల్లి విలువ తెలుసుకోలేని ఓ కొడుకు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దానిని ఎలా పరిష్కరించారనేదే ‘థ్యాంక్ యు బ్రదర్’నేపథ్యం. పాయింట్ పరంగా మంచి కంటెంట్ ఎంచుకున్న దర్శకుడు.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. మూవీలో వచ్చే కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ అంతా బోల్డ్ సీన్స్, లవ్‌ట్రాక్‌తో సోసోగా నడిపించి సెకండాఫ్‌లో అసలు కథని చూపించాడు. ఈ సినిమాకు ఉన్నంతలో ప్రధాన బలం సెకండాఫ్. అయితే సెకండాఫ్‌లో కూడా కొన్ని సీన్స్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దే స్కోప్ ఉన్నప్పటీకీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. తల్లి సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో ఆమె పాత్రని కూడా బలంగా తీర్చిదిద్దలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ గుణ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
1 ప్రముఖుల జీవిత చరిత్రను తెరపై చూపించడం కత్తిమీద సాము లాంటిదే. వారి జీవితాన్ని వెండితెరపై ఎంత భావోద్వేగభరితంగా చూపించారన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు అమోల్గుప్త సఫలమయ్యాడనే చెప్పాలి. స్టార్ బాడ్మింటన్గా ఎదగడానికి సైనా పడిన కష్టాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రథమార్థంలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్లు హృదయాలను హత్తుకుంటాయి. ముఖ్యంగా సైనా చిన్నప్పుడు కోచింగ్‌కు తీసుకెళ్లడానికి తల్లి పడే ఆరాటం, షటిల్ కొనడానికి తండ్రి అప్పు చేసే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కోచ్ రాజన్, సైనాల మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు సినిమాకు ప్రధాన బలమని చెప్పాలిఫస్టాప్ అంతా సైనా బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఎదిగిన విషయాలు చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కూడా దాన్నే కంటిన్యూ చేయడం కాస్త ప్రతికూల అంశమే. అలాగే కశ్యప్‌తో ప్రేమ వ్యవహారాన్ని కూడా అంతగా చూపించలేకపోయాడు. ఇక ఈ సినిమాకు మరో బలం అమాల్ మాలిక్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. పీయూష్ షా సినిమాటోగ్రాఫి అద్భుతమనే చెప్పాలి. బాడ్మింటన్ కోర్టును కళ్లకు కట్టినట్లుగా చూపించారు. గేమ్ సన్నివేశాలను భావోద్వేగభరితంగా, ఉద్విగ్నంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి..
0 హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా ఓ సీరియస్ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్ పెడుతూ సినిమా నడించాడు. ఫస్టాప్ ఎక్కువగా ఎమోషనల్ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టి పెట్టాడు. సెకండాఫ్ అంతా చాలా సీరియస్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్టులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే బాగుండనిపిస్తుంది. యాక్షన్స్ సీన్స్‌ని మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి
0 రొమాంటిక్ కామెడీగా రూపొందిన చిత్రమిది. చిన్న చిన్న విషయాల్లో అనుమానించి విడిపోవడానికి సిద్దమయ్యే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే.. అతను పడే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాన్ని మంచి కామెడితో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మణికాంత్ జెల్లీ. అయితే, దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం బెడిసికొట్టింది. సినిమా అంతా స్లోగా నడిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుందిహీరో, హీరోయిన్ల మధ్య ఉన్న లవ్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ, ప్రధాన పాత్రల మధ్య వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు కొంచెం టెన్షన్ కూడా పెడుతుంది. అలాగే అజయ్ మేక పిల్ల సీన్ కూడా సిల్లీగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీ. ఆయన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఆయన తెరపై కనిపించినంతసేపు ప్రేక్షకులు పగలబడి నవ్వడం ఖాయం. కాల భైరవ సంగీతం బాగుంది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. కొన్ని కీలక సన్నివేశాలలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. ఎడిటర్ సత్య గిడులూరి తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి..
0 పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ ఇది. సహజంగానే మనం మన ఇంట్లోవాళ్లను పక్కింటివాళ్లతో పోల్చి చూస్తుంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ. తమ బిడ్డ కంటే పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. దీంతో పక్కింటి వాళ్లతో పోల్చడంతో సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడతాయి. ‘రంగ్ దే’ సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే స్లో నెరెషన్ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో సినిమానే బాగానే నడిపిన, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తేవడం కాస్త ప్రతికూల అంశమే ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవి శ్రీ ప్రాసాద్ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్ దే స్టోరీ రొటీనే అయినప్పటికీ అర్జున్, అనుల టామ్ అండ్ జెర్రీ వార్ యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
1 మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథే ‘అరణ్య’. ప్రేమఖైదీ’, ‘గజరాజు’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంతో ‘అరణ్య’పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయాడు. కథ బాగున్నా.. తెరపై చూపించిన విధానం బాగాలేదు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ, కథనాన్ని ఎటో తీసుకెళ్లాడు. కథలోకి నక్సలైట్లను ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాదు. అలాగే మహిళా మావోయిస్ట్‌తో సింగ ప్రేమను కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు.అడవి జంతువుల కోసం అరణ్య పోరాడుతున్న విధానం ఆకట్టుకునేలా చూపించలేకపోయాడు.అతుకుబొంతలా వచ్చే సన్నివేశాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా సింపుల్‌గా సాగిపోతుందనే భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ఏనుగులకు రానాకు మధ్య వచ్చిన ఎమోషనల్ సీన్లు కూడా తేలిపోయినట్లు కనిపిస్తాయి. అరణ్య పాత్రని కూడా ఇంకా బలంగా తీర్చిదిద్దితే బాగుండేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం విజువల్ ఎఫెక్ట్స్. సినిమా నేపథ్యం అంతా అడవి చుట్టే తిరుగుతుంది. ఎక్కువ శాతం షూటింగ్‌ని అడవి ప్రాంతంలోనే జరిపారు. అడవి అందాలని తెరపై చక్కగా చూపించారు. థియేటర్లో ఉన్నామా లేదా అడవిలో ఉన్నామా అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ ఏఆర్ అశోక్ కుమార్ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం శాంతను మొయిత్రా సంగీతం. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయింది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. వనమాలి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.
0 ‘అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ‘మోసగాళ్ళు’ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీ సహాయంతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే ‘మోసగాళ్లు’ సినిమా కథ. అయితే ఇలాంటి కథను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్‌లనేపథ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్. తర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్లో పనిచేయడం.. దాని ద్వారా అక్రమంగా అమెరికన్ల డేటాను సేకరించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించి బోర్ కొట్టకుండా నడిపించేశాడు. అయితే అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్ చంద్ర, సునీల్ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్‌గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి. మరోవైపు ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణులకి మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ బాగుంటుంది.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్. ఈ సినిమాకు ప్రధాన బలం సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం. కొన్ని సన్నివేశాలకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
1 నిజానికి, కథాకథనానికి నేపథ్య గీతాలు, సంగీతం కాస్తంత ఎక్కువగానే వాడిన ఈ చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా వచ్చిన ఇండిపెండెంట్ సినిమా. ఎక్స్ప్లిసిట్ సీన్లు, డైలాగులు చాలానే ఉన్నప్పటికీ, మారుతున్న సమాజానికీ – మారని మనుషుల మానసిక స్థితికీ మధ్య సంఘర్షణను ప్రతిబింబించేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఇతివృత్తంతో గతంలోనే కొన్ని సినిమాలు ఇంగ్లీషు, హిందీ, మలయాళాల్లో రాకపోలేదు. ప్రేమ, పెళ్ళి, రిలేషన్షిప్ లాంటి అంశాలను తెలుగులోనూ కొన్ని సినిమాలు బలంగానే ప్రస్తావించాయి. ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ ఆ బాటలో తెరపై ఫ్రెష్‌నెస్ తీసుకురావడం గమనార్హం. ెమెరా వర్క్, పవన్ నేపథ్య సంగీతం, సమర్పకుడిగా ‘మధుర’ శ్రీధర్ రెడ్డి తీసుకున్న శ్రద్ధతో ఒక రకంగా ఈ సినిమా కలరే మారింది. బెంగళూరులో ఉంటున్న రాయలసీమ బిడ్డ జయంత్ తన తొలి ప్రయత్నంలో, ముఖ్యంగా సెకండాఫ్‌లోని కొన్ని సీన్లు బాగా రాసుకున్నారు. రెస్టారెంట్ సీన్లో హీరోయిన్ కు హీరో నిజాయతీగా ప్రపోజ్ చేసే సన్నివేశంలోని డైలాగులు చేయి తిరిగిన మాటల మాంత్రికుల్ని తలపించాయి. హీరోయిన్‌కీ – ఆమె తల్లికీ మధ్య డిస్కషన్, ముఖ్యంగా క్లైమాక్స్ లో పెళ్ళి – ప్రేమ గురించి హీరోకు హీరోయిన్ చేసే ప్రబోధం సీన్లు కాసేపు ఆలోచనల్లోకి నెడతాయి. ‘‘పెళ్ళి చేసుకుంటే ఏమొస్తుంది బొజ్జ తప్ప’’ (హీరోతో ఫ్రెండ్) లాంటివేమో నవ్విస్తాయి.
1 వరుస హిట్లతో జోరు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఈసారి ఈ చిన్న కథ, తెలుగు తెరపై కొత్త ప్రయత్నంతో సినీ నిర్మాణంలోకీ వచ్చారు. తానే మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో ప్రధానమైనది తండ్రీ కొడుకుల సెంటిమెంట్. అది అక్కడక్కడా పండింది. కానీ, కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలియకపోవడం, సాక్షాత్తూ కొడుకు పెళ్ళినే అతను చెడగొట్టడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఫ్లాష్‌బ్యాక్ బాగున్నా, తన చిన్నప్పుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన కొడుకుకు ఇంకొకరు చెప్పేవరకు అసలేం జరిగిందో తెలియదనడమూ పెద్దగా అతకలేదు. తీసుకున్న పాయింట్ బాగున్నా, కథారచనలో ఇలాంటి ఇబ్బందులున్నాయి. సహజ పరిణామ క్రమంగా కాక, అనుకున్నట్టల్లా సంఘటనలు జరిగిపోయే సినిమాటిక్ లిబర్టీలూ బోలెడు.ఫస్టాఫ్‌లో చాలా భాగం అసలు కథకు రంగం సిద్ధం చేయడంతోనే సరిపోతుంది. రాజేంద్రప్రసాద్ మూకాభినయ (మైమ్) ప్రదర్శన దగ్గర నుంచి కాస్తంత ఊపు వస్తుంది. గోతిలో పడడ మనే పాయింట్ చుట్టూరానే కథ నడిస్తే బాగుండేది. కానీ, తీసుకున్న పాయింట్ చిన్నది కావడంతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. అది అసలు కథా గమనానికి అడ్డమై కూర్చుంది. సెంటిమెంట్ పండుతున్న చాలా సందర్భాల్లో అనవసరపు హాస్యం అడ్డం పడినట్టు అనిపిస్తుంది. మరింత బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. డైలాగులు లేని మైమ్ ప్రదర్శన, క్లైమాక్స్ గోతి సీన్ లాంటి చోట్ల అచ్చు రాజమణి నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి తీరాలి. ఇవన్నీ సినిమాలో మంచి జీడిపలుకులు. కానీ, ఓవరాల్ గా వంటకంలోనే తీపి తగ్గింది.
1 అమాయకత్వంతో కూడిన కామెడీ ఎప్పుడూ ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. 'జాతిరత్నాలు' అలాంటి చిత్రమే. ముగ్గురు అమాయకులు.. ఒక సీరియస్ క్రైమ్‌లో ఇరుక్కుంటే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తాన్ని వినోదభరితంగా మలిచాడు దర్శకుడు అనుదీప్. సింపుల్ కథను మెయిన్ లీడ్ పై అశ్లీలం లేని కామెడీతో బాగా డీల్ చేసాడు. అలాగే తాను రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ చివరి వరకూ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కొచ్చి సన్నివేశాల్లో కామెడీ మరీ ఓవర్ అయినట్లు అనిపిస్తుంది. అలాగే కేసు విచారణను డీల్ చేసిన విధానం కూడా అంత కన్విన్స్‌గా అనిపించదు. ఎక్కడో లాజిక్స్ మిస్సయ్యారనే భావన కలుగుతుంది. అలాగే సెకండాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాప్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, పంచ్ డైలాగ్స్మంచి ఫన్ ను జెనరేట్ చేస్తాయి. ముఖ్యంగా బ్రహ్మానందంతో వచ్చే కోర్టు సీన్ అయితే ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు మరో జాతి రత్నం సంగీత దర్శకుడు రథన్. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. సిద్దం మనోహర్ కెమెరా పనితనం కూడా బాగుంది. ఎడిటర్ అభినవ్ రెడ్డి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
1 ఈ సినిమాకు బలం – స్క్రీన్‌ప్లేలోని వైవిధ్యం. ఇలాంటి కథ, దానికి వెండితెర కథనం రాసుకోవడం కష్టం. రాసుకున్నది రాసుకున్నట్టు తీయడం మరీ కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భుజానికెత్తుకొని, నలుగురూ ఇష్టపడేలా తీశారు – దర్శకుడు స్వర్గీయ ప్రవీణ్ వర్మ. షూటింగ్ ఆఖరులో వాహనప్రమాదంలో ప్రవీణ్ వర్మ దుర్మరణం పాలయ్యారు. దాంతో, ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని ఇచ్చిన ‘స్వామిరారా’ సుధీర్‌వర్మ పోస్ట్‌ప్రొడక్షన్ చేశారు. సాంకేతిక విభాగాల పనితనం సినిమాకు మరో బలం. 25 రోజులకు పైగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రివేళ షూటింగ్ జరుపుకొందీ సినిమా. నైట్ ఎఫెక్ట్‌లో, ఏరియల్ షాట్స్‌తో దివాకర్ మణి కెమేరావర్క్ కనిపిస్తుంది. ఈ థ్రిల్లర్‌కి నేపథ్య సంగీతం గుండెకాయ. సన్నీ ఈ చిత్రానికి గ్యాప్ లేకుండా సంగీతం ఇస్తూనే ఉన్నారు. అక్కడక్కడ కాస్తంత మితి మీరినా, ఆ నేపథ్య సంగీతమే లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఎడిటింగ్ సైతం కథ శరవేగంతో ముందుకు కదిలేలా చేసింది. సెన్సార్ లేని ఓటీటీలో సహజంగా వినిపించే, అసభ్యమైన డైలాగులు కూడా చాలానే ఉన్న చిత్రమిది. అనేక చోట్ల లాజిక్ మిస్సయి, కథనంలో మ్యాజిక్ ఎక్కువున్న ఈ సినిమాకు ఓటీటీ రిలీజు లాభించింది. థియేటర్లలో కన్నా ఎక్కువ మంది ముంగిటకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఛేజింగ్ థ్రిల్లర్ కావడంతో దర్శకుడు పలుచోట్ల తీసుకున్న సినిమాటిక్ లిబర్టీని ప్రేక్షకుడు క్షమిస్తాడు. అలాగే, దర్శకుడు ఎంచుకున్న విలక్షణ కథనం వల్ల ఒకే సీన్ సందర్భాన్ని బట్టి, పదే పదే వస్తున్నా సరే సహిస్తాడు. అక్కడక్కడా ఓవర్‌గా అనిపించే అలాంటివి పక్కన పెడితే, గంట 20 నిమిషాల కాలక్షేపం థ్రిల్లర్‌గా ఈ కథాకథనం సూపర్ అనిపిస్తుంది.
1 'కందిరీగ' లో కన్ఫ్యూజింగ్ కామెడీ చూపించి హిట్ కొట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అలాగే నవ్మశక్యం కాని సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులు తలలు పట్టుకునేలా చేశాడు. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. ఎడిటింగ్ బాగున్నా, ఎడిటింగ్ బాగున్నా, సెకండాఫ్‌లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.
1‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' వంటి సూపర్ హిట్ల తర్వాత తిరుమల కిశోర్, రామ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం రెడ్. ‘ఇస్మార్ట్ శంకర్'లాంటి సూపర్ హిట్ తర్వాతా రామ్ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కావడంతో ‘రెడ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను కొంతమేర దర్శకుడు అందుకున్నాడు. తమిళ్ మూవీ తడమ్‌కు ఇది రీమేకే అయినా.. తెలుగు ఆడియన్స్‌కు నచ్చేలా కథలో మార్పులు చేసి మెప్పించాడు. ఫస్టాఫ్‌లోనే ఇద్దరు రామ్‌లను తెరపై పరిచయం చేసిన దర్శకుడు... ఆ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో సినిమా చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఇంటర్వేల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి.. సెకండాఫ్‌పై క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు. ప్లాష్‌బ్యాక్ ట్విస్ట్‌లు కూడా ఆడియన్స్‌కి కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి.అయితే రామ్‌లోని ఎనర్జిటిక్ని దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కథలో ట్విస్ట్‌లు ఉన్నప్పటికీ.. సినిమా స్లోగా రన్ అవుతున్న భావన సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. ప్లాష్‌బ్యాక్‌లో రామ్ తల్లిని చూపించిన విధానం కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచు. సినిమాలోని డైలాగ్స్ బాగుండటంతో పాటు ఆలోచించే విధంగా చేస్తాయి. ‘రామాయణం మగాళ్లు కాకుండా ఆడాళ్లు రాసిఉంటే.. వారిపై అనుమానం ఉండేది కాదు అని ఒక్క డైలాగ్‌తో మహిళల బాధను తెలియజేశాడు. ‘నచ్చింది తినాలనుకున్నా.. తినకపోతే ఏమౌతుందిలే అనుకునే బతుకులు వాళ్లవి’ అంటూ మధ్యతరగతి బతుకులు ఏంటో తన డైలాగ్స్‌తో తెలియజేశాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఒక పాట మినహా మిగిలినవి అంతంత మాత్రమే అయినా, తనదైన బిజీఎంతో మ్యాజిక్ చేశాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రెడ్ మరీ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కాదు కాని చూడాల్సిన చిత్రమే.
1 ‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో వస్తున్న చిత్రం కావడంతో మాస్టర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలు దర్శకుడు అందుకోలేకపోయాడనే చెప్పాలి. విజయ్ లాంటి మాస్ హీరోతో ఓ సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ మసాలాలు జోడించి చెప్తామనుకొన్న డైరెక్టర్ తడబడ్డాడు. తొలిభాగం అసలు కథ చెప్పకుండా హీరోని, విలన్ని హైలెట్ చేయడానికే కేటాయించాడు. మత్తుకు బానిసైన ఫ్రొఫెసర్ పట్ల విద్యార్థులు అంతలా ఎందుకు అభిమానం చూపిస్తారో బలమైన కారణాలు చూపించలేకపోయారు. అసలు కథ ఏంటో సెకండాఫ్‌లో చూపిస్తాడు అనుకుంటే.. అక్కడ కూడా కొన్ని సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయి. ఇక హీరో ప్రతి సారి వెనక్కి తిరిగి వేసే స్టెప్పులు కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చవు. హీరో, విలన్ల మధ్య జరిగే పోరాటం కూడా అంతగా రక్తి కట్టించలేకపోయాయి.
1 హీరో, విలన్ల పాత్రలను బలంగా తీర్చిదిద్దినప్పటికీ వారిద్దరు కలిసిన సన్నివేశాలను మాత్రం మరీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కథ కూడా సగటు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతుంది. బాల నేరస్తుల అబ్జర్వేషన్ హోమ్ నేపథ్యంలో కథను తీర్చిదిద్దిన విధానం బాగుంది. అనిరుధ్ పాటలు తెలుగు ఆడియన్స్ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. యాక్షన్ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. సత్యన్ సూర్యన్ విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ‘మాస్టర్’ చెప్పే పాఠాలు ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.
1 రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చే సినిమా తీయాలనేది దర్శకుడి మెయిన్ టార్గెట్ అనేది సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమవుతంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు ఇదంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం అదే అని చెబుతూ.. తెరపై చూపించిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్‌తో చెప్పించడం, వేటపాలెం బ్యాచ్ ఒకటి బీచ్‌లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెత్తడం ప్రేక్షకులను కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టుకోవడం, అలాగే మెయిన్ విలన్ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ వెతుకుతుండగా, అది గోడ మీద నుంచి జారిపడడం అంత కన్వీనియంట్‌గా అనిపించదు. అలాగే సినిమా కథ కూడా కాస్త రొటీన్‌గా సాగుతుంది. నెక్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చెయ్యగలడు. కానీ రోటీన్ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. శ్రుతి హాసన్ మంచి సినిమాతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది, కానీ పాపం, ఆమె మాత్రం పాటలకు మరియు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపొయింది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. తమన్ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. తనదైన బిబీఎంతో యాక్షన్ సీన్లకు ప్రాణం పోశాడు. ఇక రామ్‌లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో రవితేజ విలన్స్ కి మధ్య జరిగే పోరాటాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. యాక్షన్ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్‌కి మాస్ మసాలా బిర్యానీని అందించాడు.
0 వాస్తవానికి పెళ్లి అంటే ఇష్టంలేని హీరోల కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. మొదట్లో పెళ్లి వద్దనుకుంటారు తర్వాత హీరోయిన్ చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. ఇక డైరెక్టర్ సుబ్బు కూడా ఈ రూల్స్‌ని బ్రేక్ చేయలేదు. కానీ చూపించే విధానం మాత్రం కాస్త కొత్తగా ఉంది. కామెడీతోనే ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. మనిషికి తోడు అవసరమని, భాగస్వామి లేకుంటే ఎదురయ్యే ఇబ్బందులేంటో కళ్లకు కట్టినట్లు చూపించాడు. అయితే హీరో అలా బ్రహ్మచారిగా ఉండాలని ఎందుకు డిసైడ్ అయ్యాడో కారణం చెప్పలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్తో లాగేశారు. హీరో హైదరాబాద్‌కు రావడం, ఫ్రెండ్స్ మారిపోయి పెళ్లి చేసుకోవడం, హీరో రియలైజ్ అయి పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇక ఇంటర్వెల్ ముందు హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. సెకండాఫ్‌లో మాత్రం అంతగా ట్విస్ట్లేమి ఉండవు. తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించగలడు. ఇక హీరో,హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. వెన్నెల కిషోర్ కామెడీని కాస్త పెంచితే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సైతం సింపుల్‌గా ఉండటం కొంచెం మైనస్ అయిందని చెప్పొచ్చు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో తమన్ మ్యాజిక్ చేశాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే..‘సోలో బ్రతుకే సో బెటర్’ కామెడీగా ఓ మంచి సందేశాన్ని ఇచ్చింది.
0 సమాజంలో నలుగురి దృష్టినీ ఆకర్షించేలా ఏ చిన్న నేరసంఘటన జరిగినా, దాని మీద వెంటనే ఓ సినిమా తీయడంలో వర్మ సిద్ధహస్తుడు. ఈ సినిమా కూడా అచ్చంగా అంతే. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో ఆయన శిష్యుడు ఆనంద్ చంద్ర దర్శకత్వంలో వచ్చిందీ చిత్రం. కానీ, వర్మ టేకింగ్ ఛాయలు తెర నిండా పుష్కలంగా కనిపిస్తాయి. తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన అమృత – ప్రణయ్‌ల ప్రేమకథ, పిల్ల తండ్రి మారుతీరావు చేయించారంటూ వార్తలొచ్చిన పరువుహత్య లాంటి వార్తలన్నీ అందరికీ తెలిసినవే. ఆ తెలిసిన, జరిగిన కథనే ఎమోషనల్ గా చెప్పడానికి వర్మ బందం ప్రయత్నించింది. చాలావరకు సక్సెస్ అయింది. కాకపోతే, న్యాయపరమైన ఇబ్బందుల రీత్యా ఈ సినిమాకూ, ఆ జరిగిన కథకూ సంబంధం లేదంటూ వాదించింది. నిజజీవితంలోని పేర్లను వాడకుండా, వాటికి దగ్గరగా ఉండే పేర్లతో సినిమా తీసింది. దీనికి, అనేక నిజజీవిత సంఘటనలు ఆధారమంటూ చెప్పుకొచ్చింది. కోర్టు వివాదాల మధ్య సెన్సార్ చిక్కుల్లో పడి, చివరకు తొమ్మిది మంది సభ్యుల రివైజింగ్ కమిటీ (ఆర్.సి) దగ్గర సెన్సార్ సంపాదించుకొందీ చిత్రం. ఇద్దరు – ముగ్గురు పాత్రధారులు, ఒకే ఇంటిలో తిరిగే కెమేరాతో చాలా పరిమితమైన బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా మంచి బిజినెస్ వ్యూహమే. పైగా, ఆ పరిమితులేవీ తెలియనివ్వకుండా వీలైనంత జాగ్రత్తపడడానికి ప్రయత్నించడమూ ముచ్చటేస్తుంది. కానీ, ఒక దశలో కథ ముందుకు సాగక, అదే నాలుగు గోడల ఇంట్లో... అవే పాత్రలు, అదే రకమైన డైలాగులతో ప్రేక్షకులకు విసుగనిపిస్తుంది. అయితే, అంతటి ఆ విసుగులోనూ కూర్చొనేలా చేసే నేర్పు కూడా దర్శకుడి తీత చేసిన మాయాజాలం. అందుకు సహకరించిన కెమేరా, నేపథ్య సంగీత విభాగాలను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్న ప్రేమకథలన్నిటినీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో తెరపై చూపడం రీతి, రివాజు. కానీ, ఈ ‘మర్డర్’ కథను మాత్రం అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచిన తండ్రి దృష్టి కోణం నుంచే పూర్తిగా చూపడం కొత్తగా అనిపిస్తుంది. అందుకే, సినిమా చూశాక, ప్రేమికుల మీద కన్నా పెంచిన తల్లితండ్రుల మీదే కొంత ఎక్కువ సానుభూతి కలిగితే తప్పు పట్టలేం. వెరసి సమాజంలో జరిగే ఇలాంటి మర్డర్ లను సమర్థించలేం. తెరపై చూపిన ఈ కథను బాగుందని అనలేం. పూర్తిగా బాగా లేదనీ చెప్పలేం
0 వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సక్సెస్ ఫుల్ నిర్మాత గా మారిన ఎం ఎస్ రాజు.. దర్శకుడిగా కూడా అలాంటి ప్రేమ కథా సినిమాలే తీశాడు. వాన, తూనీగ తూనీగ సినిమాలు ప్లాప్ అయినప్పటికీ దర్శకుడిగా ఆయన ప్రతిభకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈసారి ప్రేమ కథలను పక్కనబెట్టి అడల్ట్ కంటెంట్ ని నమ్ముకున్నాడు. డర్టీ హరి అనే టైటిల్ తో సినిమాలో డర్టీ ఎంతుంటుందో చెప్పకనే చెప్పేసాడు. ట్రైలర్లో కూడా అదే చూపించాడు. ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చవని తెలిసినా కూడా ఎంఎస్ రాజు తొలిసారి పెద్ద సాహసమే చేశాడు. సినిమా స్టారింగ్లోనే బోల్డ్ సన్నివేశాలతో ప్రారంభించి రిచ్ లైఫ్ ని పరిచయం చెయ్యడం కోసం ప్రతి సీన్ లో ప్రతి ఒక్కరి చేతిలో మందు గ్లాస్, చేతిలో సిగరెట్స్, హీరోయిన్స్ తో స్కిన్ షోస్ తో బూతు డైలాగ్స్ తో సరిపెట్టాడు.యువతరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను తెరకెక్కించాడు. శృంగారాన్ని కూడా టైటిల్‌కు తగ్గట్టే చూపించాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువగా శృంగార సన్నివేశాలను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం అసలు కథను చూపించాడు. వేరే యువతితో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల హీరో పడే కష్టాలు,తన ఇల్లీగల్ సంబంధాన్ని దాచలేక ఇద్దరి హీరోయిన్స్ మధ్యలో నలిగిపోయే హీరో ఇబ్బందులును, ఆ ఇబ్బందులను అధిగమించే క్రమంలో ఒక హత్య జరగడం, ఆ మర్డర్ కేసు నుండి హీరో ఎలా తప్పించుకున్నాడు లాంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. అయితే సినిమా మొత్తం వాస్తవానికి దూరంగా సినిమాటిక్‌గా సాగిపోతుంది. హీరో రావడంతో ధనవంతుల అమ్మాయితే ప్రేమలో పడిపోవడం, అలాగే వేరే యువతికి ఆకర్షితుడైపోవడం.. ఇవన్ని వాస్తవానికి చాలా దూరంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సినిమా సాగుతోంది. ఇక సెకండాఫ్‌లో మాత్రం కొన్ని ట్విస్ట్ ఇచ్చి సినిమాను నిలబడేలా చేశాడు దర్శకుడు. సినిమాకు ప్రధాన బలం సెకండాఫ్ అనే చెప్పాలి. అలాగే హరి-జాస్మిన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తి కరంగా ఉంటాయి. హత్య కేసును కాస్త ఆసక్తికరంగా మలిస్తే బాగుండేది.
1 మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. ఇలాంటి సినిమాల్లోని ఎమోషన్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ కథ కొత్తదేమి కాదు. అందరికి తెలిసిన కథే. అయినప్పటికీ దర్శకుడు వినోద్ తెరకెక్కించిన విధానం బాగుంది. తొలి సినిమానే ఇలాంటి నేపథ్యం ఉన్న కథను ఎంచుకొని సాహసమే చేశాడని చెప్పొచ్చు. తొలి సీన్‌తోనే పాత్రలను పరిచయం చేసి, అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఏ సన్నివేశం కూడా తెచ్చిపెట్టినట్టు కాకుండా సాఫీగా కథలో భాగంగా కొనసాగుతుంది. పల్లె ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో అచ్చం అలాగే సినిమాలో చూపించారు. గుంటూరు నేపథ్యంగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఆ యాసను, అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించారు. మధ్య తరగతి కష్టాలెలా వుంటాయనేది డ్రామా లేకుండా సహజంగా చూపించారు. పాటలు కూడా తెచ్చిపెట్టినట్టు కాకుండా కథలో భాగంగా వచ్చిపోతాయి. ఫస్టాఫ్ మొత్తం చాలా సాఫీగా, బోర్‌కొట్టకుండా నడిపించిన డైరెక్టర్.. సెకండాఫ్‌ను మాత్రం కాస్త నెమ్మదిగా కొనసాగించాడు. హోటల్ పెట్టాక హీరోకి వచ్చిన ఇబ్బందులను తెరపై సరిగా చూపించలేకపోయాడు. చట్నీ రుచిగా లేకపోవడం, ఎన్నిసార్లు ప్రయోగం చేసినా ఫలించకపోవడం, చివరకు మామిడి కాయను చూడగానే ఏదో ఐడియా వచ్చినట్లు హీరో ఫీలై.. సక్సెస్ కావడం కన్వినెన్స్‌గా అనిపించదు. హీరో ఫ్రెండ్ లవ్ స్టోరిని చూపించినంత ఆసక్తిగా హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. హీరోయిన్ పెళ్లి చూపుల సీన్ కూడా సాగతీతగా అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా చూసిన ప్రతి మధ్యతరగతి యువకుడు తనను తాను హీరో పాత్రతో పోల్చుకుంటాడు.
1 నువ్వెంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి చాటి చెబుతా అంటూ మానస తన తాతయ్యతో చెప్పిన మాటలకు కొనసాగింపుగా సాగిన ఈ కథలో మొదట.. హీరోయిన్ కుటుంబ పరిస్థితులు, వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సీన్లు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు కాస్త భిన్నంగా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్‌లో అసలైన కథ మొదలవుతుంది. కాఫీ వ్యాపారంలో నంబర్ వన్‌గా కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) కారణంగా మానసకు ఎదురైన తొలి ఓటమితో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్ ఛాయ్‌కు తిరుగులేదని ప్రతీ సీన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మాయే కదా వ్యాపారం ఎలా చేస్తుంది, విజయం ఎలా సాధిస్తుంది అనుకునే వారికి ఈ సినిమా మంచి సమాధానం. అంతర్లీనంగా మహిళా సాధికారికతకు పెద్దపీట వేసినా, కథను వినోదాత్మకంగా సాగించడంలోనూ దర్శకుడు నరేంద్రనాథ్ కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం అనే కాన్సెప్ట్ కూడా రొటీన్‌గా ఉన్నా.. కీర్తి సురేష్ వంటి నటిని ఈ కథకు ఎంపిక చేసుకోవడం ద్వారా హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయాడు.
color photo last movie